Monday, December 23, 2024
spot_img
HomeతెలంగాణQuthbullapur:గంజాయి స్మగ్లర్లు అరెస్ట్….

Quthbullapur:గంజాయి స్మగ్లర్లు అరెస్ట్….

ఒరిస్సా నుండి డిల్లీకి సప్లయ్….

ముప్పై లక్షల విలువైన 86 కిలోల గంజాయి ,కారు స్వాధీనం…

 పరారిలో ముగ్గురు నిందితులు …

Quthbullapur:ఒరిస్సా నుండి డిల్లీకి గంజాయిని రవాణ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు . శుక్రవారం మేడ్చల్ డీసిపి కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలఖరుల సమావేశంలో   మేడ్చల్ డీసిపి కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.

 డీసిపి తెలిపిన వివరాల ప్రకారం….. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సునీంద్ర కుమార్  సింగ్  ఒరిస్సా నుండి వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులకు  సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో గంజాయి ని సప్లయ్ చేసే రాజు అనే వ్యక్తితో సునీంధ్ర కుమార్ కు పరిచయం ఏర్పడింది.  అదే క్రమంలో సునీంద్ర కుమార్  కు చెందిన హోండా సిటీ కారులో గంజాయి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా భాక్స్ లు తయారు చేసి ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఓ ముఠా గా ఏర్పడ్డారు.

వీరువురికి శివ అనే వ్యక్తి జత కలిశాడు. గంజాయి కావాలి డిల్లీ లో నివసించే అమిత్ అగర్వాల్ అనే వ్యక్తికి గంజాయి సరఫరా చేయడానికి సునీంద్ర కుమార్ సింగ్ ఒప్పందం  చేసుకున్నాడు. అ విషయం రాజుకు  చెప్పడంతో శివతో కలిసి  కారును తీసుకెళ్లి  86 కిలోల గంజాయిని  ప్రత్యేకంగా తయారు చేసిన భాక్స్లలో నింపి   ఆంధ్ర ఒరిస్సా భార్దర్ లో సునీంద్ర కుమార్ సింగ్ కు ఇచ్చారు. అక్కడి నుండి  హైదరాబాద్ ,ముంబయి మీదుగా డిల్లీకి  వెళుతున్నారు.

 విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ ఎస్వోటి పోలీసులు  ఔటర్ రింగ్  రోడ్డు మీద దుండిగల్ దగ్గర కారును తనిఖీ చేయగా గంజాయి  పట్టుబడింది. కారును , 30 లక్షల విలువై గంజాయిని స్వాధీనం చేసుకుని సునీంద్ర సింగ్ ను మరియు అతని భార్యగా నటించిన లక్ష్మీ అనే మహిలను అదుపులోకి తీసుకున్నారు.అమిత్ అగర్వాల్ , రాజు,శివలు పరారిలో ఉన్నారు.

సునీంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి ఇదివరకే రెండు కేసులలో నిందితుడిగా  ఉన్నాడని డీసిసి తెలిపారు. గంజాయి స్మగర్లను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఓస్వోటి పోలీసులను డిపిపి అభినందించారు. గంజాయి సమాచారం తెలిస్తే 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని డీసిపి  సూచించారు. పోలస్ సిబ్బందికి రివార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ ఏసీపి శ్రీనివాస్ రెడ్డి,,అడిషనల్ డిసిపి పురుషోత్తం, రాజేంద్రనగర్  ఎస్వోటి  ఇన్ స్పెక్టర్  రమణారెడ్డి,దుండిగల్ ఇన్స్పెక్టర్  సతీష్,ఎస్సై శంకర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి  తరలించడానికి భార్య… భర్తల్లాగా  నాటకం:

సునీంధ్ర కుమార్ సింగ్  గంజాయి ని డిల్లీకి తరలించేటప్పుడు  పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండటానికి  పోలీసులు దృష్టి మరల్చడానికి లేడీస్ ఉంటే సేప్ గా భావించాడు. దీంతో ఒరిస్సా ,మల్కన్ గిరి జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళకు అరు వేల రూపాయలు ఇస్తానని తన భార్యగా నటిస్తూ డిల్లికి  రావాలని ,దారిలో ఎవరు ఆపినా వైద్యం కోసం డిల్లికి వెళ్లున్నామని చెప్పాలని చెప్పి ఒప్పించి తనతో తీసుకు వచ్చాడు. హైదరాబాద్ వరకు సాఫీగానే సాగిన వారి ప్రయాణం పోలీసులకు ఉప్పందండంతో  పోలీసులకు చిక్కి కటాకటాలపాలయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments