Monday, December 23, 2024
spot_img
Homeజిల్లాలుQuthbullapur:జర్నలిస్ట్ కాలనీలో అన్ని సదుపాయాల కల్పనను కృషి

Quthbullapur:జర్నలిస్ట్ కాలనీలో అన్ని సదుపాయాల కల్పనను కృషి

Quthbullapur:కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

Quthbullapur:జర్నలిస్ట్ కాలనీలో అన్ని సదుపాయాల కల్పనను కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు.

 నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జర్నలిస్ట్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బుధవారం పలువురు జర్నలిస్టులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ను మర్యాద పూర్వకంగా కలిసి కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

దీంతో స్పందించిన MLA మాట్లాడుతూ ఇప్పటికే జర్నలిస్టు కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సరఫరా వంటి వసతులను కల్పించామని, రాబోయే రోజుల్లో కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణము, పిల్లల పార్కు, చెర్ల ఎల్లమ్మ దేవాలయానికి రోడ్డు వంటి అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు.

 జర్నలిస్ట్ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆస్కాని మారుతి సాగర్, జర్నలిస్టులు లాలయ్య, దేవేందర్, కృష్ణారావు, మారుతి కుమార్, గోవిందరావు, గణేష్, రమేష్, శ్రీనివాసరావు, జగదీష్ గుప్త, మల్లికార్జున్, జీతయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments