కడ్తాల్, అక్టోబర్ 05 ( అక్షర గళం ) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో పొలిసు ఉద్యోగాలు సాధించిన యువకులను గురువారం గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా ముదిరాజ్ ఆధ్వర్యంలో వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామం నుండి రావిచెడ్ మహేష్, అమంచ శ్రీలత, ఆర్కోటం శివ కుమార్, యాట శివ కుమార్, ఎర్ర దేవేందర్,ఎర్ర నవీన్. పోలీస్ ఉద్యోగాలు సాధించారు.
ఈ సందర్బంగా యాట నర్సింహ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉద్యగాలు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాల్ రాజ్, మరియు ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షులు శబ్బు, ఇరిగేషన్ ఆఫీసర్ శేంకర్ బాబు, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పోతుగంటి అశోక్, మండల కో అప్షన్ సభ్యుడు జహంగీర్ బాబా, నాయకులు చంద్రయ్య, బాలకృష్ణ,శివ, శంకర్ ,శేఖర్, పాల్గొన్నారు.