- – ప్రధాని నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటన
– ఈ పర్యటన సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం
– రెండు దేశాల మధ్య రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక, వాణిజ్య సంబంధాలు
-ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
అక్షరగళం, ప్రధాని నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్, ఇథియోపియా మధ్య వాతావరణంలోనే కాకుండా స్ఫూర్తిలోనూ సారూప్యత ఉందని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వయంగా కారు నడుపుతూ విమానాశ్రయం నుంచి హోటల్ వరకు మోదీని తీసుకువచ్చారు.పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేశారు. ఇథియోపియా విముక్తి కోసం భారత సైనికులు కూడా పోరాడారని తెలిపారు. వేలాది మంది భారతీయ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారని, . కరోనా మహమ్మారి సమయంలో భారత్ 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపిందని, అందులో భాగంగా ఇథియోపియాకు 4 మిలియన్లకు పైగా డోసులు అందించడం గర్వకారణమని అన్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రదానం చేశారు. ఈ గౌరవానికి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

