Phone Tapping:తెలంగాణాలో ఒకవైపు లోక్ సభ ఎన్నికలు వస్తున్నా విషయం తెలిసిందే, ఐతే మరో వైపు BRS నాయకులూ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఈ తరుణంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలన అంశంగా మారింది.ఇందులో ఇప్పటికే చాల మంది పోలీస్ అధికారులు అరెస్ట్ కాగా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారకంగా ప్రకటించారు.దేశంలో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్టు కింద కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది.
Phone Tapping:తెలంగాణ రాజకీయాల్లో సంచలంగా మరీనా ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో విస్తుపోయే వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే పలువు పోలీసులు అరెస్ట్ కాగా వాళ్ళ విచారణలో చాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ కాగా,అదనపు ఎస్పీ లైన భుజంగరావు,తిరుపతన్నను విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు.వీళిద్దరిని కోర్ట్ కస్టడీకి 5 రోజుల పాటు పంపాలని తీర్పు ఇచ్చింది.వీరితోపాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును నిన్న పది గంటల పాటు విచారించక అరెస్ట్ చేసారు.రాధాకిషన్ రావుతో పాటు ఇన్స్‌పెక్టర్ గట్టుమల్లును కూడా విచారించి కొన్ని కీలక విషయాలు రాబట్టారని సమాచారం.
వీరి దగ్గర నుంచి రాబట్టిన ఆధారాలతో కేసును అధికారకంగా నమోదు చేసారు.ఈ కేసును టెలిగ్రాఫు యాక్టు కింద నమోదు చేశారు.అయితే దేశంలో తొలిసారి టెలిగ్రాఫ్ యాక్టు కింద నమోదయిన కేసు ఇదే కావడం గమనార్హం. 1885 ఫోన్ ట్యాపింగ్ కింద కేసు నమోదవ్వడం వల్ల కేసు గురించి అందరిలో ఆసక్తి నెలకొంది.