aksharagalam.com

భక్తులకు సేవల్లో లోపాలు: తిరుపతమ్మ ఆలయ ఈవో పై వేటు.

అక్షరగళం, అమరావతి:
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో భక్తుల సేవల్లో లోపాలు ఉన్నట్లు ఆర్టీజీఎస్‌ సమీక్షలో తేలడంతో సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ఈవో కిశోర్‌కుమార్‌ను తప్పించి, ఆయన స్థానంలో డిప్యూటీ కమిషనర్‌ మహేశ్వరరెడ్డిని కొత్త ఈవోగా నియమించారు. బుధవారం ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. భక్తులకు మెరుగైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో దర్శనాలు, పారిశుద్ధ్యం, త్రాగునీరు సరఫరా తదితర అంశాలు లోపాభూఇష్టంగా ఉండటంతో గత ఈవో పై చర్యలు తీసుకున్నారు.

Exit mobile version