aksharagalam.com

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : పట్నం మహేందర్ రెడ్డి

అక్షరగళం , మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలిలో పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించి ఘట్ కేసర్ లోని బంధన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డితో కలిసి 350 మంది లబ్ధిదారులకు రూ.4 కోట్ల 6 లక్షల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఘట్కేసర్ మండలంలో 46 మందికి, మేడిపల్లిలో 110 మందికి, కీసరలో 60 మందికి, కాప్రా లో 16 మందికి మూడు చింతలపల్లి మండలంలో 32 మందికి, మేడ్చల్ మండలంలో 86 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సుల ప్రయాణాలను కల్పించడంతోపాటు అర్హులైన ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులను, సన్న బియ్యం ను కొత్తగా పంపిణీ చేసిందని చెప్పారు.

ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లా మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని పేర్కొంటూ50 చర్చిలకు 30 వేల చొప్పున 15 లక్షల నిధులను మహేందర్ రెడ్డి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, ఆర్టీఏ సభ్యులు జైపాల్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యులు ముజీబ్, ఘట్కేసర్ మండల తహాసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version