పారిస్ ఒలంపిక్స్ లో టార్చ్ లైట్ తో పరుగులు….
అక్షరగళం ,స్పోర్ట్స్ డెస్క్ః ప్రమాదంలో కాలు కొల్పోయిన ఓ టెన్నీస్ స్థార్ ఓలంపిక్ జ్యోతిని పట్టుకుని పారిస్ వీధుల్లోపరుగులు పెట్టాడు. పారాఒలింపిక్స్ కెవిన్ పియెట్
మరికొన్ని గంటల్లో పారిస్ లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకకు ముందు చాలా మంది ప్రసిద్ధ ఆటగాళ్లు ప్యారిస్ వీధుల్లో టార్చ్‌లతో పరుగెత్తడం కనిపించింది. ఆ ఆటగాళ్ళలో ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ కెవిన్ పియెట్ ఒకడు. అతను నడవలేడు. 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఈ ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ నడవగలిగే శక్తిని కోల్పోయాడు. అయినప్పటికీ.. కాళ్లు పోయినంత మాత్రాన.. నడవ లేనంత మాత్రాన జీవితం అంతటితో ఆగిపోదు అంటూ పది మందికి ఉదాహరణగా నిలిచాడు ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్. చేతిలో టార్చ్ పట్టుకుని పారిస్ వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించాడు. నడవని వ్యక్తి పరుగులు తీయడం అనే అద్భుతం ఎలా జరిగింది అనేది ప్రశ్న. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. సాంకేతికంగా విభిన్న రీతిలో సామర్థ్యం పొందుతోంది.
కెవిన్ పియెట్ కూడా ఒక టెక్నిక్ సహాయంతో పారిస్ ఒలింపిక్స్ టార్చ్ మార్చ్‌లో పాల్గొన్నాడు. ఒలింపిక్ టార్చ్‌తో పరుగెత్తడానికి.. అతను రోబోటిక్ ఎక్సోస్కెలిటన్‌ను ఉపయోగించాడు. కెవిన్ ఇంతకుముందు నుంచి కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. కెవిన్ పియెట్ కూడా రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ ద్వారా పారిస్ ఒలింపిక్స్ టార్చ్ రిలేలో పరుగెత్తడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి, అతను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిగెత్తిన మొదటి అథ్లెట్ అయ్యాడు. కెవిన్ పియెట్ తన ఎక్సోస్కెలిటన్‌తో ఒలింపిక్ జ్యోతిని మోసుకెళ్లి చరిత్ర సృష్టించాడు/. ఫ్రెంచ్ పారాలింపిక్స్ టెన్నిస్ స్టార్ కెవిన్ పీట్ పారిస్‌లో చేసిన ఫీట్%ౌ% అతని దైర్యం.. ఇతర దివ్యాంగులతో పాటు ఇతర పారా క్రీడాకారులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పుడు, మరికొందరు దివ్యాంగ ఆటగాళ్లు తదుపరి ఒలింపిక్స్‌లో టార్చ్ మార్చ్‌లో భాగం అయ్యే చాన్స్ ఉంది అందడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆశ్చర్య పడాల్సిన అవసరం అసలే ఉండదు. రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ వికలాంగులు లేదా వృద్ధులు నడవడానికి సహాయపడుతుంది. ఇది వైకల్యాన్ని పూర్తిగా తొలగించదు కానీ అది వారిని స్వావలంబనగా మారేలా చేస్తుంది. కెవిన్ పియెట్ కూడా రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ సహాయంతో టార్చ్ రిలేలో ఇలాంటి స్వీయ-విశ్వాసాన్ని చూపించాడు.