Sunday, December 22, 2024
spot_img
Homeఆంధ్రప్రదేశ్New Liquor Policy in AP: కొత్త లిక్కర్ పాలసీ,మందు బాబులకు ఊరట.

New Liquor Policy in AP: కొత్త లిక్కర్ పాలసీ,మందు బాబులకు ఊరట.

New Liquor Policy in AP:ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మద్యం దుకాణాలను ప్రయివేటుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.గత ప్రభుత్యం చేసిన తప్పు తాము చేయమని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కల్తీ  లేని మద్యాన్ని అందిస్తామని చెప్పారు. అలాగే 10 శాతం గీతకార్మికులకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

New Liquor Policy in AP:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందు బాబులకు తీపి వార్త చెప్పింది. మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో మద్యం అమ్మనునట్లు  తెలిపింది. 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఈవిధానంలో మద్యం రిటైల్‌ వ్యాపారం మొత్తం ప్రైవేట్​కే అప్పగిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 3396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే మరో 396 దుకాణాలను అదనంగా వచ్చే అవకాశం ఉంది.

అక్టోబర్ 4,5 తేదీల్లో కొత్త మద్య విధానం అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దింతో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.లాటరీ ద్వారా లైసెన్స్‌లు కేటాయించనున్నారు. ఈ విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్‌, సత్యకుమార్ యాదవ్‌, గొట్టిపాటి రవికుమార్‌ సచివాలయంలో సమావేశమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు చూపించగా  ఆయన కొన్ని మార్పులు చెప్పారు.  ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్లో

 ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో మద్యంఅమ్మకాలను  ప్రభుత్వమే చూసుకునే విధంగా  ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించనుండటంతో మళ్లీ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments