నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలకు పోలీసు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు
-జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి, అక్షరగళం
వనపర్తి -4 ఆత్మకూరు-1 మొత్తం 5 కేంద్రాల్లో 1340 మంది అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష
పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు
వనపర్తి జిల్లాలో డిసెంబర్ 13, 2025 (శనివారం) రోజున జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష –2026 కోసం వనపర్తి జిల్లాలో 5 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరుకానున్నారని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు.
ఈ పరీక్షలు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షలు నిర్వహి స్తారని ప్రశాంతంగా జరిగేలా సంబందిత పోలీసుఅధికారులకు భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. జిల్లాలో పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసుశాఖ సమగ్ర భద్రత ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీసు బందోబస్తు సిబ్బంది విధుల్లో ఉంటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రజలు పోలీసులకు సహకరించాలి, విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని ఎస్పీ అన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద శనివారం ఉదయం 08:00 నుండి సాయంత్రం 04:00 వరకు 163 BNSS.( సెక్షన్ 144) సెక్షన్ అమల్లో ఉంటుంది పరీక్ష కేంద్రాలకు 500 మీటర్లు పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడ వద్దని ఆమె సూచించారు.

