aksharagalam.com

14 నుంచి జాతీయ‌ ఇంధన పొదుపు వారోత్సవాలు

14 నుంచి జాతీయ‌ ఇంధన పొదుపు వారోత్సవాలు

దేశ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 14 నుంచి…20 వ‌ర‌కు ఇంధ‌న పొద‌పు వారోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇంధ‌న పొద‌పు వారోత్స‌వాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంధన పొదుపు ఆవ‌శ్య‌క‌త‌…

ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావి తరాలకు మంచి భవిష్యత్ అందించ‌వ‌చ్చు. అవసరమైన సమయంలోనే విద్యుత్‌ ఉపయోగించుకోవడం ద్వారా ఇంధ‌నాన్ని ఆదా చేయాలి. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
దేశ వ్యాప్తంగా ఈ నెల 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సంప్ర‌దాయ ఇంధ‌న వ‌న‌రుల‌ను ర‌క్షించేందుకు సూర్యఘర్‌ వంటి పథకాల ద్వారా లబ్ధిపొందాలి. విద్యుత్‌ను సోలార్‌ ఇంధన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కోసం…
ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించేందుకు అధికారులు ప్ర‌త్యేక కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్‌ వినియోగంపై గ్రామాల్లో జానపద కళాకారులు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు పోటీలు…
దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు, స్వయం సహాయక సంఘాల మహిళా బృందాలతో ముగ్గుల పోటీ లు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ నెల 14నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా…అన్ని జిల్లా కేంద్రాల్లో, డివిజన్ల పరిధిలో ర్యాలీలు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. 20న ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయ‌నున్నారు.

Exit mobile version