Saturday, February 28, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిALLఉత్తర ద్వారదర్శనంతో… పరవశించిన భక్తజనులు

ఉత్తర ద్వారదర్శనంతో… పరవశించిన భక్తజనులు

– ముక్కోటి ఏకాదశి పర్వదినంతో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

– తెల్లవారు జాము నుంచే దేవాలయాల వద్ద బారులు

– ప్రత్యేక పూజలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

అక్షరగళం, హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయాల పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణలు, భజనల మధ్య ఉత్తర ద్వార దర్శనం కల్పించడంతో భక్తులు పరమానందాన్ని పొందారు. వైకుంఠ ద్వార దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో వేలాదిమంది భక్తులు ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, జూబ్లిహిల్స్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆధ్యాత్మికత శోభ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments