aksharagalam.com

కుత్బుల్లాపూర్ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు

– గాజులరామారంలో రూ.47 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

అక్షరగళం , గాజుల రామారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తెలిపారు. గాజులరామారం గ్రామంలో సుమారు రూ.47 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రాధాన్యమని అని, ముఖ్యంగా బస్తీలు, కాలనీల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన జీవనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో గాజులరామారం డివిజన్‌ను మరింత అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే వివేకానంద్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, ఇమ్రాన్ బేగ్, మూసా ఖాన్, బోయిని మహేష్, చెట్ల వెంకటేష్, సుంకరి చందు, గోవర్ధన్ రెడ్డి, నాగేష్, దూలప్ప, చిన్నా చౌదరి, బాబీ చౌదరి, రాములు గౌడ్, హమీద్, ప్రసాద్, జునైద్, శ్రవణ్, గౌస్, అఖిల్, విజయ్ కుమార్‌తో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version