aksharagalam.com

రాములోరి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

– ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

అక్షరగళం, కుత్బుల్లాపూర్: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తికావాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆకాంక్షించారు.
జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్‌లో రామాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆదివారం చేపట్టిన శిలా పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతటి దైవికమైన, బృహత్తరమైన కార్యాన్ని తమ భుజస్కంధాలపై నడిపిస్తున్న ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. శ్రీరామచంద్ర ప్రభు కృపకటాక్షాలతో దేవాలయ నిర్మాణ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా, నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, కాలనీ అధ్యక్షులు యేసు, కాలనీ సభ్యులు సోమ నర్సయ్య, ఉమేష్ సింగ్, హరీష్, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, మల్లేష్ గౌడ్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసూదన్ రాజు, నదీమ్ రాయ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, కాలే నాగేష్, మహిళా నాయకురాలు అరుణా రెడ్డి, కాలే గణేష్, ఆటో బలరాం, నల్ల ప్రసాద్, కుంట వేణు, బాలమల్లేష్, నారాయణ, వెంకటేష్ గౌడ్, గుబ్బల లక్ష్మీ నారాయణ, ఏవి. శేషాచారి, సత్యనారాయణ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version