aksharagalam.com

గెలిచిన అభ్యర్ధిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేకపూడి గాంధీ

అక్షరగళం , 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్ కాలనీకి చెందిన అంజయ్య యాదవ్ ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో వికారాబాద్ జిల్లా, నవాబుపేట్ మండలం, కడిచర్ల గ్రామ పంచాయితీ నుండి పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించిన సందర్బంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి అంజయ్య యాదవ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో మరెళ్ల శ్రీనివాస్, నాగరాజు, రమణారెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version