aksharagalam.com

కాంగ్రెస్ అభ్యర్థుల‌ను గెలిపించే బాధ్యత మీది…అభివృద్ధి చేసే బాధ్యత నాది…-ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది… అభివృద్ధి చేసే బాధ్యత నాది…….ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోగుల ప్రత్యూషకు మద్ధ‌తుగా శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చిట్యాల గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాన్ని పట్టించుకోలేక సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే అన్నారు

చిట్యాల సర్పంచ్ అభ్యర్థి పోగుల ప్రత్యూషని గెలిపించుకునే బాధ్యత మీది… చిట్యాల గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే మేగా రెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిట్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Exit mobile version