విభజన సమస్యలపై ఎమ్మెల్యే వివేకానంద్ సమీక్ష
డివిజన్ల విభజన ప్రక్రియ సరిగా లేదన్న ఎమ్మెల్యే
విభజన సమస్యను పరిష్కారించాలని డిమాండ్
సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి-కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 12
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పెట్బషీరాబాద్ క్యాంప్ ఆఫీస్‌లో GHMC పరిధిలోని 8 వార్డులు మరియు 3 మున్సిపాలిటీల విభజన సమస్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో GHMC పరిధిలోని 8 డివిజన్లు మరియు దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల డివిజన్ల విభజన ప్రక్రియను సమీక్షించారు. ప్రజల అభ్యంతరాలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చినా, GHMC అవసరమైన వివరాలు ప్రజలకు అందించకపోవడం వల్ల పెద్ద ఎత్తున అయోమయం ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ సమావేశంలో ప్రధాన అంశాలను ప్రస్తావించారు.
డివిజన్ల విభజన ప్రక్రియ సక్రమంగా, విధివిధానాలకు అనుగుణంగా జరగలేదని…పునర్విభజనకు అవసరమైన తాజా డివిజన్ మ్యాప్‌లు ఇప్పటికీ GHMC అందించలేదన్నారు.
ప్రతి డివిజన్ పరిధిని గుర్తించేందుకు అవసరమైన ఇంటి నంబర్ల వివరాలు ప్రకటించలేదని…జనాభా లెక్కల ప్రకారం ఎన్యుమరేషన్ బ్లాక్‌ల వివరాలు వేళ్లడించలేదన్నారు.
పోలింగ్ బూత్‌ల జాబితా కూడా ప్రకటించలేదని…కాలనీ పేర్లు స్పష్టంగా లేకపోవడం వల్ల ప్రజలు తమ డివిజన్ సరిహద్దులను గుర్తించలేకపోతున్నారని ఆయన తెలిపారు.
ఈ ముఖ్యమైన వివరాల లేమితో GHMC నిర్ణయించిన గడువు లోపల ప్రజలు ఎలా అభ్యంతరాలు సమర్పించగలరని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ప్రశ్నించారు.
నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా GHMC అధికారులు వెంటనే…డివిజన్ మ్యాప్‌లు, కాలనీ జాబితాలు,
ఇంటి నంబర్ వివరాలు, పోలింగ్ బూత్ సమాచారం, ఎన్యుమరేషన్ బ్లాక్ డేటా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు కూడా ఈ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ… ఎమ్మెల్యే సంబంధిత GHMC ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు.
