అక్షరగళం :ఘట్కేసర్ లోని ఏరియా ఆసుపత్రిలో పేషంట్లకు అందించే సేవలను మరింత విస్తృతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అన్నారు. మంగళవారం కలెక్టర్ ఘట్కేసర్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించి పేషంట్లకు అందించే సేవలను మరింత విస్తృతం చేయాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో ఉన్న విభాగాలు పరిశీలించి వాటి పనితీరును డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని తనిఖీ చేస్తూ రెండు ల్యాబ్ రిజిస్టర్లను ధృవీకరించి, CHC ఘట్‌కేసర్ మరియు PHC ఉప్పల్‌లో ELISA పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు. ENT విభాగానికి ఓపి సేవలను పెంచాలని డాక్టర్లను సూచించారు.
డెలివరీ పేషెంట్‌తో ఇంటరాక్ట్ అయ్యి, ఆమె ఆరోగ్యం మరియు బర్త్ డోస్ టీకాల గురించి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ విభాగాన్ని పరిశీలించి, సంబంధిత సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రోగుల సంఖ్య గురించి ఆరా తీశారు. బ్లడ్ బ్యాంక్‌ని సందర్శించి స్టాక్ లభ్యతను తనిఖీ చేసారు. బ్లడ్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. మేల్, ఫీమెల్ వార్డులను సందర్శించి వైద్యులు అందించే సేవల గురించి పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రఘునాథస్వామి, ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ పావని, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు