aksharagalam.com

టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు బండి ర‌మేష్‌ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిక‌లు

టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు బండి ర‌మేష్‌ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిక‌లు

కూక‌ట్‌ప‌ల్లి, డిసెంబ‌ర్ 13 (అక్ష‌ర‌గ‌ళం)

టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు, కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ తో భరత్ నగర్ కాలనీ నుండి ఏ బ్లాక్ అద్యక్షులు డాక్టర్ పి నాగిరెడ్డి ఆధ్వర్యములో బండి రమేష్ సమక్షంలో నాయ‌కులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
జి. బిక్షపతి గౌడ్, నరేందర్ బాబు, సత్య నారాయణ, మధు, వెంకటేష్, తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజా పాలన ఎంతో బాగుందని వారు ప్రవేశ పెట్టిన పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు.
అలాగే కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పిలిస్తే పలికే నాయకులని, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భరత్ నగర్ కాలనీలో హరి హార క్షేత్ర దేవస్థానం లో కూడా చాలా అభివృద్ధి పనులు పూర్తి చేసిన సంగతి మర్చిపోలినిదని వారు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కాలని సంక్షేమ కోరకు ఇంకొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతూ మనవి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్మయ్య డివిజన్ అద్యక్షులు కె. రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దూరి రాము, భరత్ నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిల్ల వెంకటేశ్ యాదవ్, జనరల్ సెక్రెటరీ నరేష్ కుమార్, బీఆర్‌ నాగేశ్వర్ రావు, కేఎస్ఎన్ మూర్తి, వెంకట పతి రాజు, నవాబ్ సాబ్, సంతోష్ కుమార్‌, శ్రీనివాస్, ఎన్ఎస్‌యూఐ కిట్టులు పాల్గొన్నారు.

Exit mobile version