-విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం
-విద్యార్థుల పై ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పై 4 నుండి 5 లక్షల వరకు ఖర్చు
-బ్యాడ్మెంటన్, క్రికెట్, కబడ్డీ, స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, వాలీబాల్, సైక్లింగ్, హాకీ వంటి క్రీడలకు అవసరమైన గ్రౌండ్ ఏర్పాటు
అక్షరగళం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అందుకు కావలసిన పరికరాలు, గ్రౌండ్ వంటి సౌకర్యాలను అందిస్తానని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మిక్కిలినేని మను చౌదరి విద్యార్థులకు తెలియజేసారు.శనివారం శామీర్ పేట్ మండలం హకీంపేట లో గల తెలంగాణ ప్రభుత్వ క్రీడల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ. స్కూల్లో ఎంతమంది విద్యార్థులున్నారని, ఏయే స్పోర్ట్స్ ఉన్నాయని, కోచ్ లు బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నారా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్య తో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వారికి ఆసక్తి ఉన్న క్రీడల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ కాకుండా అదనంగా ఏమేమి స్పోర్ట్స్ కావాలని విద్యార్థులను అడుగగా, బ్యాడ్మెంటన్, క్రికెట్, కబడ్డీ, స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, వాలీబాల్, సైక్లింగ్, హాకీ వంటి క్రీడలకు అవసరమైన గ్రౌండ్, స్పోర్ట్స్ పరికరాలను విద్యార్థులు కావాలని కోరగా కలెక్టర్ పరిశీలించి అందజేస్తామని తెలిపారు. అంతర్జాతీయ క్రీడల పోటీల వరకు వెళుతున్న విద్యార్థుల పై ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పై 4 నుండి 5 లక్షల వరకు ఖర్చు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
కోచ్ లు ఎంత శిక్షణ ఇచ్చినప్పటికి మీకు చిత్తశుద్ది, అంకితభావం స్వీయ క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. రోజురోజుకు మన ఆలోచనలు, అభిప్రాయాలు మారుతుంటాయని వాటిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ముందుకు వెళ్లాలని వివరిస్తూ, మీరు శ్రద్దగా బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో మీకు ఉద్యోగ పరంగా గాని, వ్యాపార పరంగా గాని అవసరమైన సహాయాన్ని తప్పకుండా అందిస్తానని కలెక్టరు విద్యార్థులకు హామీ ఇచ్చారు. సివిల్స్ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎప్పుడైన సరే అందుబాటులో ఉంటూ మీకు కావలసిన అవసరమైన మార్గనిర్దేశాన్ని సలహా, సూచనలను అందిస్తానని కలెక్టరు మిక్కిలినేని మను చౌదరి విద్యార్థులకు తెలియజేసారు. వ్యక్తిత్వ వికాసం పెంపొందించే మంచి మాటలు విద్యార్థులకు కలెక్టర్ తెలిపారు. అనంతరం జెమ్నాస్టిక్ హాల్, గ్రౌండ్స్ ను కలెక్టర్ సందర్శించారు.
