aksharagalam.com

డివిజన్ల విభజన సమతుల్యంగా జరగలేదు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నియోజకవర్గం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసి డివిజన్లు 300 కావడంతో కూకట్పల్లి నియోజకవర్గం లోని డివిజన్ల విభజన సమతుల్యంగా జరగలేదని. అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు. మరియు పరిధులు వేరే నియోజకవర్గానికి చేరడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విధంగా జరగడం వల్ల అభివృద్ధి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామని అందువల్ల ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ కార్పొరేషన్లు పక్క నియోజకవర్గంలోకి వెళ్లకుండా సమతుల్యంగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లతో చర్చించి సిఫార్సులు ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సమర్పించే విధంగా చర్యలు తీసుకుందామని నిర్ణయించార. ఒక కుకట్పల్లి నియోజకవర్గంలోనే కాకుండా మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ విధంగానే డివిజన్లు విభజించడం వల్ల రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఆ టంకాలు కలుగుతాయని మరొకసారి సమీక్షించి డివిజన్లు సమతుల్యంగా విభజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా.. కార్పొరేటర్లు నరసింహ యాదవ్. ఆవులు రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, సభియా గౌసిద్దీన్. పగుడాల శిరీష బాబురావు ,మందడి శ్రీనివాసరావు , మహేశ్వరి శ్రీహరి.మాజీ కార్పొరేటర్లు తుము శ్రావణ్ కుమార్, పగు డాల బాబురావు.. డివిజన్ అధ్యక్షులు ,సెక్రెటరీలు పాల్గొన్నారు.

Exit mobile version