aksharagalam.com

స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో…తెలంగాణలో స్కూళ్లకు 6 రోజుల సెలవు

స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో…
తెలంగాణలో స్కూళ్లకు 6 రోజుల సెలవు

తొలి, మూడో విడత పోలింగ్ కోసంనాలుగు రోజుల సెలవులు
రెండో విడత పోలింగ్ వీకెండ్ కావడంతో కలిసి వచ్చిన సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ‌ల్ల‌పాఠశాలలకు వరుస సెలవులు వ‌స్తున్నాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయ్య‌డం కామ‌న్‌. ఇందుకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సుమారు ఆరు రోజుల పాటు సెల‌వులు ఉంటాయి.

తొలి విడత పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్ల కోసం డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనుండగా, ఆ రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో అవి సాధారణ సెలవులు కలిసివచ్చాయి.

మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

మరోవైపు, పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు కార్మికులకు సైతం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Exit mobile version