కుత్బుల్లాపూర్,అక్షరగళంఃకుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పది చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు ,నాలాల ఆక్రమణ మరియు రిటైర్ అయి 10 సంవత్సరాలు గడుస్తున్న నిబంధనలకు వీరుద్దంగా AE గా రామారావు కొనసాగించడం వల్లనే చెరువుల పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి లేదని, తక్షణమే నూతన ఏఈని నియమించాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలో పది చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్న లింగం చెరువు, చిన్న బంధం కుంట, పంతులు కుంట, మహబూబ్ కుంట, పెద్ద చెరువు, బంధం కుంట, చింతలచెరువు, మధ్యల చెరువు, కాలమనకుంట, వడ్డవానికుంట వాటిలో గతంలో మూడు చెరువులకు ఫెన్సింగ్ వేసిన ఫెన్సింగ్ వేసిన తీసివేసి కబ్జా చేసుకోవడం కాకుండా చెరువుల ఎఫ్టిఎల్/ బఫర్ జోన్లో దర్జాగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఆక్రమించుకొని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు తుతూ మంత్రంగానే చర్యలు తీసుకున్నారు, దానికి నిదర్శనమే ఈరోజు ఏ చెరువులో చూసిన ఆక్రమణలు తప్ప చెరువు పరిరక్షణ కనిపించడం లేదు అని మరియు చెరువుల నందు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరగడానికి ఇరిగేషన్ ప్రథమ ముద్దాయి అయితే రెవెన్యూ రెండవ ముద్దాయి మూడో ముద్దాయి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
చెరువుల నందు ఆక్రమణలు యదేచ్ఛగా జరగడానికి కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కుత్బుల్లాపూర్ పరిధిలో పనిచేసే రామారావు….
అలాగే కుత్బుల్లాపూర్ పరిధిలో చెరువుల నందు ఆక్రమణలు యదేచ్ఛగా జరగడానికి కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కుత్బుల్లాపూర్ పరిధిలో పనిచేసే రామారావు ప్రధాన ఎందుకంటే అతను రిటైర్ అయి 10 సంవత్సరాలైనా ఇరిగేషన్ అధికారులు గత బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు& బిల్లర్ల సహకారంతో ఆ పదవిలో కొనసాగుతూ, చెరువుల నందు ఎన్ఓసిలు ఇవ్వడం మరియు కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలో మీటింగ్లో మినట్స్ ఆఫ్ ది మీటింగ్లో సంతకం పెట్టే స్థాయిలో అధికారం చేలాయించడం వల్ల ఎలాంటి బాధ్యత వహించలేని పదవి వల్ల చెరువుల ఆక్రమణకి ప్రత్యక్షంగా పరీక్షంగా సహకరించడం వల్ల చెరువుల పరిరక్షణ గాల్లో దీపం లాగా మారింది. రిటైర్ అయి 10 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనిచేస్తున్నాడని, తక్షణమే ప్రభుత్వం రిటైర్ ఇరిగేషన్ ఏఈని మార్చి ప్రభుత్వ ఉద్యోగి నియమించాలని ఫిర్యాదు లో పేర్కోన్నారు.
కుత్బుల్లాపూర్ పరిధిలో పరిధిలో లింగం చెరువు నుంచి పరికి చెరువు వారికి మరియు పంతులు చెరువు నుంచి పరికి చెరువు వారికి ఇరిగేషన్ గొలుసుకట్టు చెరువుల నాలాలు 70% కబ్జా గురైంది, ఇప్పటికైనా కుత్బుల్లాపూర్ పరిధిలో ముఖ్యంగా సూరారం, గాజుల రామారo పరిధిలో వరదలు వచ్చిన ప్రతి సంవత్సరం నాళాలు ఆక్రమణ వల్లనే ప్రతిసారి ఇండ్లు నీట మునుగుతున్నాయి. కావున తక్షణమే 10 చెరువుల పరిరక్షణకు సర్వే చేసి, ఫైనల్ నోటిఫికేషన్ తో హెచ్ఎండిఏ సైట్లో మ్యాప్స్ అప్లోడ్ చేయడమే కాకుండా, ఎఫ్ టి ఎల్ పాయింట్ నందు పిల్లర్స్ ఏర్పాటు మున్సిపల్ అధికారుల సహకారంతో వేయించాలని మరియు ఇరిగేషన్ నాళాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవడం కాకుండా, నాలాలో మొత్తం సిమెంట్ బాక్స్ కాలాలతో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, మురళి ,అరుణ్ రావు, మాధవరావు, ముకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు


