aksharagalam.com

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి – ఎఎంసీ విజయ్ కుమార్

అక్షర గళం , కూకట్ పల్లి : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎఎంసీ విజయ్కుమార్ అన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో ఎఎంసీ, విజయ్ కుమార్,టౌన్ప్లానింగ్ సెక్షన్ .జూనియర్ అసిస్టెంట్ సాయి కుమార్, ఎఎంఓహెచ్ డాక్టర్ కె.ఎస్. రవి, ఇంజనీరింగ్ ఎఈ ప్రశాంత్, ఎంటామాలజీ సెక్షన్ .చిన్న, యుబీడి సెక్షన్ సమీర, ఎలక్ట్రీకల్ విభాగం లక్ష్మి ప్రియా వివిధ శాఖల అధాకారులు ప్రజావాణి లో పాల్గొన్నారు . ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ -13, ఇంజనీరింగ్ -01, ఎంటామాలజీ 1 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు, చెప్పడం జరిగింది.

Exit mobile version