*– వీడియో తీస్తూ గుండె నొప్పితో కుప్పకూలిన కెమెరామెన్*
*– ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి*
*– ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ గా గుర్తింపు*
– కేటీఆర్ పర్యటనలో గుండెపోటుతో మృతి చెందిన ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్
అక్షర గళం, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన పర్యటనను చిత్రీకరిస్తున్న ఓ ఛానల్ కెమెరామెన్ గుండెపోటుతో కుప్ప కూలాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడు ఆజ్ తక్ టీవీ ఛానల్ లో పనిచేస్తున్న దామోదర్ గా గుర్తించారు.