Kothagudem:మీనామృత్ మిల్క్ పార్లర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
Kothagudem:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం, ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీ లో కృష్ణవేణి గ్రామ సంఘం, అంజన SHG, జయలక్ష్మి సభ్యురాలు నిర్వహిస్తున్న మిల్క్ పార్లర్ సందర్శించి వారి వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు.
మంచి లాబాలలో నడుస్తున్నదని పెట్టుబడి మొత్తం రూ.6 లక్షలకు గాను బ్యాంకు రూ. 4 లక్షలు, CIF రూ.2 లక్షలు లోన్ తీసుకోని మిల్క్ పార్లర్ గత రెండు నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని, సీజన్ లో ప్రతి రోజు రూ. 15 వేల వ్యాపారం, సీజన్ కానీ టైంలో ప్రతి రోజు రూ.5 వేల వ్యాపారం చేస్తున్నామని ఇది లాభసాటిగా ఉన్నదని జిల్లా కలెక్టర్ కు జయలక్ష్మి వివరించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు ప్యాకింగ్ తో పాటు, బ్రాండింగ్ ఉత్పత్తులు కూడా ఉంచినట్లయితే అధికలాభాలు పొందవచ్చని తెలియచేసి, జయలక్ష్మి సభ్యురాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యం.విద్యాచందన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి , DPMలు, APMల, CCలు, VOAలు పాల్గొన్నారు.