మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబుని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ నగరంలోని ఐటీ శాఖ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సమస్యలు, కొత్తగా ఏర్పటైనా డివిజన్ లపై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, యువజన నాయకుడు బుచ్చి రెడ్డి, బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండు, నిజాంపేట్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

