ఈ నెల 15న ప్రారంభించనున్న ప్రధాని మోది
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
అక్షరగళం, వెబ్‌డెస్క్: త్వరలో హైదరాబాద్ నాగ్ పూర్‌మధ్య వందేభార్ ట్రైన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ `నాగ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ సెవిూ హైస్పీడ్ రైలు సర్వీసులు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైలును వర్చువల్ వేదికగా ప్రారంభిస్తారని అధికారికంగా వెల్లడిరచారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఐదో రైలు ఈ నెల 15నుంచి పరుగులుపెట్టబోతోందన్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రైలు నాగ్‌పుర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.15గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. రాత్రి 8.20గంటలకు నాగ్‌పుర్ చేరుకుంటుందని ’ఎక్స్’ లో పేర్కొన్నారు. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రాపుర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ రైలును నిలుపుతారని పేర్కొన్నారు.