హైదరాబాద్, (అక్షర గళం): తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా సోమవారం శాసనసభకు హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభలో కేసీఆర్ హాజరుతో బీఆర్ఎస్ శాసనసభా పక్షంలో ఉత్సాహం నెలకొన్నట్లు కనిపించింది.

