aksharagalam.com

కెసిఆర్ కు ఘన స్వాగతం పలికిన శ్రేణులు

అక్షరగళం, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న సందర్భంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్‌ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అనంతరం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం (ఎల్పీ)తో పాటు రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం జరిగింది. పార్టీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version