నీలాంటి కుక్కల్ని చాలా చూశాం.!
నీ బండారం బైటపెడితే తట్టుకోలేవ్ అన్న మాధవరం
కల్వకుంట్ల కవితకు మాధవరం మాస్ వార్నింగ్
నీలాంటి కుక్కల్ని చాలా చూశాం.!
నీ బండారం బైటపెడితే తట్టుకోలేవ్ అన్న మాధవరం
కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు…
కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నీలాంటి కుక్కల్ని చాలా చూశామని
కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ బండారం బైటపెడితే తట్టుకోలేవ్ అంటూ కవితను కృష్ణరావు ఏకిపారేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత అంశం రాజకీయంగా పెనుదుమారంగా మారింది. ఇటీవల హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో కవిత మాట్లాడుతూ… హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా భూములు కబ్జాలు చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మి, పూలమ్మి .. భూములు కూడా కబ్జాలు పెట్టాడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజకీయాంగా దుమారం చెలరేగింది.
ఈ క్రమంలో కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితకు కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ పార్టీని భ్రష్టుపట్టించడానికి సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కల్పిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును, కేటీఆర్ ను జైలుకు వెళ్లేలా లేని పోనీ నిందలు వేస్తుందని అన్నారు.
కేసీఆర్ మర్యాద కోసం ఇన్ని రోజులు ఊరుకుంటున్నామన్నారు. ఉద్యమంలో అసలు కవిత ఎక్కడ ఉందన్నారు. లిక్కర్ మాఫీయాతో చేతులు కల్పి జైల్లో చిప్పకూడు తిన్నావంటూ ఎద్దేవా చేశారు. నీ చరిత్రను గల్లి నుంచి ఢిల్లీ దాకబైటకు తీస్తామన్నారు. తమపై కబ్జాలు అంటూ ఆరోపణలు చేస్తున్నకవిత.. బంగారం దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఎక్కడ భూములు కబ్జాలు పెట్టావో బండారం బైటపెడ్తామంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు.
బాలానగర్‌లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని ఓవర్‌ల్యాప్ ల్యాండ్‌ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని ఆరోపించారు. పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారని ఫైర్ అయ్యారు.
