Kadthal:మండలంలోని చల్లంపల్లి గ్రామంలో 2013 సం:లో 2 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేయించానని దానికి సహకరించిన రైతుకు సబ్ స్టేషన్ కోసం భూమిని ఇచ్చిన రైతు కు 3 లక్షల రూపాయలు, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించానని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు.
Kadthal:మంగళవారం అయన చల్లంపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చల్లంపల్లి సబ్ స్టేషన్ నుండి వంపుగుడా, చల్లంపల్లి, సలార్ పూర్ గ్రామాలకు 1000 నుండి 5000 కెవి విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని మరియు ఇట్టి సబ్ స్టేషన్ ద్వారా గృహాలకు, గ్రామాల రైతులకు, డొమెస్టిక్, ఇండస్ట్రీయల్ లకు విద్యుత్ ఉత్పత్తి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
Kadthal:గత కొద్దీ రోజుల నుండి లోయర్ పవర్ ( తక్కువ కెపాసిటీ నాణ్యత కలిగిన పవర్) ద్వారా ఇబ్బందులు కలిగి బోరు మోటర్ లు, ట్రాన్స్ఫార్మర్స్ లు పాడువుతున్నాయని రైతులు మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ దృష్టికి తీసుకరావడం జరిగింది.
దీనికి వెంటనే మాజీ ఎమ్మెల్యే స్పందించి చల్లంపల్లి గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కు ఆయన వచ్చి పరిశీలించారు.ఆయన వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రజలు లోయర్ పవర్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి కి తీసుకెళ్లి త్వరలో ఇక్కడ ఏర్పాటు చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు
రోడ్డు పనుల పరిశీలన:
కడ్తాల్ నుండి వయా చల్లంపల్లి, పడకల్ గేటు వరకు బీటీ డబుల్ రోడ్డు జరుగుతున్న పనులను కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ పరిశీలించారు. తాను గతంలో చల్లంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్డు ను శ్రమదానంతో వేయించడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా వారు 1999 లో ఏమెల్యే గా ఉన్నప్పుడు 60 లక్షల రూపాయల తో బీటి రోడ్డు ని మంజూరు చేసి నిర్మించానని తెలిపారు.
2023 లో గత ప్రభుత్వ హయాంలో తాను ఏమెల్యే గా ఉన్నప్పుడు 19 కోట్ల 95 లక్షల రూపాయలతో డబుల్ బీటీ రోడ్డు ను మంజూరు చేయించానని మరియు ఈ రోడ్డు మధ్యలో 25 కల్వర్టులు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.
వంపుగుడ చల్లంపల్లి, సలార్పుర్ గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్ నిర్మాణం చేస్తారని తెలిపారు. దీనితో పాటు తలకొండపల్లి – వెల్జల్ కు 37 కోట్ల రూపాయలతో మరియు కల్వకుర్తి లో 500 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లను నిర్మించానని పేర్కొన్నారు.
గతంలో చల్లంపల్లి గ్రామ పంచాయతీ లో ప్రభుత్వ విజయ డైరీని పాల బీఎంసీ ని 2 కోట్ల రూపాయలతో నిర్మించి దీని కోసం 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు ప్రహరీ గోడను మంజూరు చేశానని పేర్కొన్నారు.అదే విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం 34 విజయ బీఎంసీ పాల ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేశానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చల్లంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుర్క కృష్ణయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ రమేష్, బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు కానం శ్రీశైలం గౌడ్, గుర్క కొమురయ్య, రాజేందర్ యాదవ్, మర్ల వెంకటేష్, గుర్క సాయిలు, గుర్క శ్రీశైలం, శ్రీశైలం, శివనంద చారి, రామస్వామి, తాండ్ర రమేష్, గ్రామ యువకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.