Kaapra:స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట 25 వేలు చెల్లించుకోలేక గోస పడుతున్న కుటుంబాలు
Kaapra:చాలీచాలని కట్టెలతో అధ్వానంగా అంతిమ సంస్కార కార్యం…
Kaapra:కుషాయిగూడ స్మశాన వాటిక పేరు శాంతివనమైనప్పటికీ మొత్తం అశాంతికి నిలయంగా మారిపోయింది.తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది.ఎవరైనా చనిపోతే అంతిమ దహన సంస్కారాలు చేయాలంటే స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట దోచుకుంటారనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
ఒక్కో చావుకు రూ 25,000/- వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చాలీ చాలని కట్టేలతో అంతిమ దహన సంస్కారాలు చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు మంగళవారం చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట 25 వేల రూపాయలు చెల్లించుకోలేక అనేక కుటుంబాలు గోసపడుతున్నాయని తెలియజేశారు.
కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కుషాయిగూడ (శాంతి వనం) స్మశాన వాటిక నిర్వహణ పై తక్షణమే చర్యలు తీసుకోగలరని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ కోరారు.