Jony Master: జానీమాస్టర్ పై రేప్ కేసు..మాస్టర్ జైలుకి వెళ్లనున్నారు..?
Jony Master:ఈ రోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఒక రేప్ కేసు నమోదయంది. ఇలా రోజు ఎక్కడో ఒక దగ్గర జరగడం సర్వసాధారం అనుకుంటే మీరు పొరపడినట్లే, ఎందుకంటె ఇక్కడ కేసు బుక్ ఐంది టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ మరి. ఎన్నో superhits అందించారు టాలీవుడ్కి,అలాగే బాలీవుడ్,కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసారు.
ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు.అతను ఎవరనుకుంటున్నారా? తనే కొరియోగ్రాఫర్ జానీమాస్టర్.. కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరో కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు ఫిర్యాదు స్వీకరించి జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు.
చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌ల సందర్భంగా జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే నార్సింగిలోని తన నివాసంలో జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. జానీ మాస్టర్‌పై సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (సెక్షన్ 506), సెక్షన్ 323(2)(ఎన్) కింద దాడికి పాల్పడినట్లు, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు.
ఈ పార్టీ తరపున పలుచోట్ల విస్తృత ప్రచారం నిర్వహించారు.జానీ మాస్టర్స్‌పై ఇప్పటికే ఒక కేసు ఉంది, దీనిలో 2015లో విశ్వవిద్యాలయంలో ఒక మహిళపై దాడి చేసినందుకు మేడ్చల్ కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష వేశారు.
తాజాగా ఓ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణల ఆధారంగా జానీ మాస్టర్స్‌పై కేసు నమోదైంది. జానీ మాస్టర్స్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ తప్పుడు ఆరోపణలపై జానీ మాస్టర్స్ ఎలా స్పందిస్తారో చూద్దాం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.