aksharagalam.com

మహిళా నాయకత్వానికి నూతన దిక్సూచి, ఐఎఫ్‌హెచ్‌ఈలో స్త్రీ 5.0 ప్రారంభం

మహిళా నాయకత్వానికి నూతన దిక్సూచి, ఐఎఫ్‌హెచ్‌ఈలో స్త్రీ 5.0 ప్రారంభం

“స్త్రీ 5.0 : శక్తి, పురోగతి, అవకాశాలు,మారుతున్న ప్రపంచంలో మహిళత్వాన్ని పునర్ ఆవిష్కరించడం” పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ఐఎఫ్‌హెచ్‌ఈ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఐఎఫ్‌హెచ్‌ఈ మహిళా అభివృద్ధి కేంద్రం మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో దేశీయ,అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.

ఐసీఎఫ్‌ఏఐ సంఘం అధిపతి సోభ రాణి యసస్వీ దీపప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ప్రధాన అతిథి శ్రీమతి శైలజ కిరణ మహిళలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు అత్యవసరమని పేర్కొంటూ నాయకత్వం కరుణ, సహకారం, పట్టుదలతో నిర్వచించబడతుందని చెప్పారు. మార్గదర్శిని సంస్థను భారీ స్థాయికి తీసుకెళ్లిన తన ప్రయాణాన్ని పంచుకుని ఆవిష్కరణ, సమావేషం కీలకమని వివరించారు.

అతిథి ప్రొ. రాజలక్ష్మి శాస్త్ర,సాంకేతిక రంగాలలో మహిళల పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. డా. సునీతా రావు లింగసమానత్వంపై మరింత శాస్త్రీయ పరిశోధనలు అవసరమన్నారు. డా. కోటి రెడ్డి మహిళల ఆర్థిక చేర్చుకోవడమే స్థిరాభివృద్ధికి బలం అని చెప్పారు.

డా. విజయలక్ష్మి ఐఎఫ్‌హెచ్‌ఈ మహిళా అభివృద్ధి కార్యక్రమాలను వివరించగా, డా. దీపా శ్రీనివాస్ సదస్సు ప్రధానాంశాలను వివరించారు.

Exit mobile version