Saturday, February 21, 2026
No menu items!
Advertisement
హోమ్క్రైమ్చంపాడు…వాట్సాప్ స్టేటస్ పెట్టాడు…ఆ త‌ర్వాత‌..?

చంపాడు…వాట్సాప్ స్టేటస్ పెట్టాడు…ఆ త‌ర్వాత‌..?

చంపాడు…వాట్సాప్ స్టేటస్ పెట్టాడు…ఆ త‌ర్వాత‌..?

భార్యను చంపాడు…త‌ర్వాత తాను చ‌చ్చాడు…

ప్ర‌దేశంః జయశంకర్ భూపాలపల్లి
నిందితుడుః బాలాజీ రామాచారి-భ‌ర్త‌ (50)
హ‌తురాలుః సంధ్య‌-భార్య (42)

ఇంట్లో జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌ను వేగ‌లేక ఓ భ‌ర్త త‌న భార్యకు ఉరివేసి…తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లం సీతారాంపురం గ్రామానికి చెందిన 50 ఏళ్ళ‌ బాలాజీ రామాచారి అనే వ్య‌క్తి …త‌న భార్య 42 ఏళ్ళ‌ సంధ్య‌ను ఉరి వేసి హ‌త‌మార్చాడు. త‌ర్వాత తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ముందుగా భార్య‌ను తాడుతో ఉరి వేసిన బాలాజీ…సోష‌ల్ మీడియాలో స్టేట‌స్ పెట్టాడు. స్థానికుల స‌మాచారం మేర‌కు అక్క‌డికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కుటుబం క‌ల‌హాలే ఈ దుర్ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కూతురు తనను వేధిస్తున్నారని.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై భార్యను హత్య చేసినట్టు వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు ఓ భర్త. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

కాగా గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య బాలాజీ రామాచారి (50)ను హత్య చేసి.. అనంతరం తానే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒకే కుటుంబంలో రెండు ప్రాణాలు పోవడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

రామాచారికి ఇది రెండో వివాహ‌మ‌ని…ఒక కూతురు కూతురు కూడా ఉంద‌ని…ఈ మ‌ధ్య కాలంలో బాలాజీ రామాచారి కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయంటున్నారు స్థానికులు.

ఈ ఘ‌ట‌న‌తో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments