aksharagalam.com

హోమ్ గార్డ్ కు సైబరాబాద్ సీపీ ఆత్మీయ పరామర్శ

అక్షరగళం ,సైబరాబాద్ : ట్రాఫిక్ విధుల్లో గాయపడ్డ మదాపూర్ ట్రాఫిక్ పీఎస్ కు చెందిన హోమ్ గార్డ్ ఎండీ నయీముద్దీన్ ను శుక్రవారం మెడికవర్ ఆసుపత్రి (హైటెక్ సిటీ) లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ డాక్టర్ యం. రమేష్, ఐపీఎస్., పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవకు అయ్యే ఖర్చు బాధ్యత పోలీస్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుందని వారి కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. సీపీ వెంట మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఐపీఎస్., మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మాదాపూర్ ఏడీసీపీ ఉదయ్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎ. శ్రీధర్ కుమార్, సిబ్బంది ఉన్నారు.గత నెల డిసెంబర్ 30 వ తేదీన ఉదయం పర్వత్ నగర్, జైహింద్ ఎన్‌క్లేవ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో నయీముద్దీన్ ని కార్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్ కుడి కాలు విరిగింది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు, కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version