aksharagalam.com

Holy Water | మహాప్రసాదం.. Bhakti

Holy Water | మహాప్రసాదం..
మ‌హాప్ర‌సాదం అర్థం అంటే సంస్కృతంలో “పవిత్ర జలం” లేదా “పవిత్ర స్థలం” అని అర్థం. దేవతలకు చేసే అభిషేకంలో ఉపయోగించే పవిత్ర జలాన్ని(pavithra jalam) తీర్థం అని పిలుస్తాం. ఆల యంలో స్వామివారి లేదా అమ్మవారి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదం తీసుకోవడం విధిగా, అత్యంత పుణ్య దైవ కార్యంగా భావిస్తారు. దేవుడు లేదా దేవత దర్శనం ముగిసిన తదుపరి పురోహితుడు చేతిలో పోసే తీర్థాన్ని అమృత మహాప్రసాదంగా స్వీకరిస్తాం. తీర్థం తీసుకోకుండా దైవ దర్శనం పూర్తి కాదు. తీర్థంలో అదృశ్య శక్తి దాగి ఉందని, తీర్థానికి ఔషధ గుణాలు ఉంటాయని భక్తుల నమ్మకం. పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు దాగి ఉంటాయి. తీర్థం ఎలా తీసుకోవాలో, ఎన్ని సార్లు తీసుకోవాలో తెలుసుకోవడం ప్రదానం. మూడు సార్లు తీర్థం తీసుకోవడం వల్ల భోజనానంతర(after meal) శక్తి ఊరుతుందని నమ్ముతారు. మొదటి సారి తీర్థంతో శారీ రక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ ధర్మ పరివర్తనలు చక్కదిద్దబడ తాయి. మూడో సారి తీసుకోవడంతో పరమేశ్వరుడి పరమపదం అని భావించి తీసుకోవడం జరుగుతుంది. పవిత్ర తీర్థం తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు ఆరోగ్యం కూడా ఒనగురుతుంది.

Exit mobile version