– అభిమానుల రద్దీతో మ్యాచ్ వేదిక మార్పు
🔹 జింఖానా వద్ద భారీగా గుమిగూడిన క్రికెట్ అభిమానులు
🔹 ఆటగాళ్ల–అభిమానుల భద్రత దృష్ట్యా ఉప్పల్ మైదానానికి మార్పు
🔹 గుజరాత్‌పై బరోడా 8 వికెట్ల తేడాతో విజయం
అక్షరగళం, హైదరాబాద్:
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై అభిమానుల ఆదరణ ఉప్పొంగింది. గురువారం జరగాల్సిన బరోడా–గుజరాత్ మ్యాచ్‌కు అనూహ్యంగా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకోవడంతో నిర్వాహకులు మ్యాచ్ వేదికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొదట జింఖానా మైదానంలో మ్యాచ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. అయితే హార్దిక్ ఉన్న హోటల్ ముందు, నెట్ ప్రాక్టీస్ ప్రాంతం వద్ద, టికెట్ కౌంటర్ల వద్ద అభిమానులు భారీగా గుమిగూడడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ ను జింఖానా నుంచి ఉప్పల్ స్టేడియంకు మార్చామని నిర్వాహకులు వెల్లడించారు. ఆటగాళ్ళ భద్రత మరియు అభిమానుల సురక్షిత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇక మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. పాండ్యా 10 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి జట్టు విజయంలో పాత్ర పోషించాడు.
