Hara Hara Veeramallu:హర హర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.సోమవారం (సెప్టెంబర్ 23) సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఈ గుడ్ న్యూస్ వెల్లడించారు.అంతేకాదు ఈరోజు నుంచే పవన్ తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడం ఫాన్స్ కు పూనకాలు తెపించే విషయం.
Hara Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్లి షూటింగ్కి వస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక ,ఇప్పుడే తన పెండింగ్ సినిమాల షూటింగ్ ను షెడ్యూల్ చేస్తున్నారు. ఈ రోజు నుంచే విజయవాడలో షూటింగ్ మొదలు పెట్టారు.ఈ సినిమాని సమ్మర్లో ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఇన్ని రోజులు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్, ఇప్పుడు మళ్లీ తన పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు.
పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ కానుంది.అంతేకాదు సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం 7 గంటల నుంచి విజయవాడలో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా మెగా సూర్య ప్రొడక్షన్ వెల్లడించింది.
“ఎవరూ ఆపలేని శక్తి.. ఎవరూ విచ్ఛిన్నం చేయలేని స్ఫూర్తి. వచ్చే ఏడాది మార్చి 28న మీ దగ్గర్లోని థియేటర్లలోకి వచ్చేస్తోంది. ది వారియర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు షూటింగ్ లో చేరారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలోని ఓ సెట్ లో తిరిగి ప్రారంభమైంది” అనే క్యాప్షన్ తో మెగా సూర్య ప్రొడక్షన్ ఈ విషయం తెలిపింది.
హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో రాబోతోంది.మూవీ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ ఓ ఖడ్గాన్ని గాల్లోకి దూస్తూ కనిపించాడు. ఈ కొత్త పోస్టర్ లో క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది. గతంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన క్రిష్ తర్వాత తప్పుకోగా,జ్యోతి కృష్ణ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నారు.