*జిహెచ్ఎంసి విస్తరణ పూర్తి*
*– మరో 27 సర్కిళ్ల జోడింపు*
*– మొత్తం సంఖ్య 57కు చేరిన జిహెచ్ఎంసి సర్కిళ్లు*
*– ఆరు వేలకు పైగా ఉద్యోగులు సిబ్బంది జిహెచ్ఎంసి అండర్లోకి*
*– రికార్డులు స్వాధీనం*

అక్షరగళం, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) తన విస్తరణ ప్రక్రియలో భాగంగా మరో 27 సర్కిళ్లను చేర్చింది. దీంతో మొత్తం సర్కిళ్ల సంఖ్య 57కి పెరిగింది. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా విలీనం చేసిన ప్రతి మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్‌ను ప్రత్యేక సర్కిల్ గా పరిగణిస్తూ ఏర్పాట్లు చేపట్టారు.
*క్రొత్తగా చేర్చిన 27 యుఎల్బీలకు తాత్కాలిక డిప్యూటీ కమిషనర్లు*
క్రితం వరకు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లుగా ఉన్న వాటిని జిహెచ్ఎంసి లో విలీనం చేయడంతో అదనంగా మరొక 27 సర్కిల్ జిహెచ్ఎంసిలో ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు తాత్కాలికంగా డిప్యూటీ కమిషనర్లను ఏర్పాటు చేశారు. పూర్వము ఆయా మున్సిపల్, కార్పొరేషన్లలో కమిషనర్లుగా వ్యవహరించిన వారినే డిప్యూటీ కమిషనర్లుగా నియమించడం జరిగింది. వీరందరూ సమీప జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది.
*కొత్త సర్కిళ్లను జోన్లకు అనుసంధానం*
🔸 చార్మినార్ జోన్‌కు ఆదిభట్ల, బడంగ్ పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్
🔸 శేరిలింగంపల్లి జోన్‌కుబండ్లగూడ జాగీర్, మణికొండ, నర్సింగ్, అమీన్పూర్, తెళ్లాపూర్
🔸 ఎల్బీ నగర్ జోన్‌కుమీర్పేట్, పెద్ద అంబర్పేట్, తుక్కుగూడ, దమ్మైగూడ, ఘట్కేసర్, పీర్జాదిగూడ, పోచారం🔸 సికింద్రాబాద్ జోన్‌కుబోడుప్పల్, జవహర్నగర్, నాగారం, తుంకుంట
🔸 కూకట్ పల్లి జోన్‌కుదుండిగల్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్, నిజాంపేట్బోలారం
*ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్*
సవరించిన జిహెచ్ఎంసి చట్టం, 1955 ప్రకారం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని కవర్ చేయడానికి జిహెచ్ఎంసి పరిధిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో మునిసిపాలిటీల చట్టం, జిహెచ్ఎంసి చట్టం సవరణలు అమల్లోకి వచ్చాయి.*రికార్డు స్వాధీనం ప్రక్రియ*ఇక విలీనమైన మున్సిపాలిటీల సంబంధించిన రికార్డులను జిహెచ్ఎంసి స్వాధీనం చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. యుఎల్బీ ప్రొఫైల్, సిబ్బంది వివరాలు, చర/స్థిర ఆస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులుపన్నులు/నాన్ ట్యాక్స్ ఆదాయం, గత 3 ఏళ్లలో ఇచ్చిన లేఅవుట్, బిల్డింగ్ అనుమతులు, వంటి రికార్డులను స్వాధీనం చేసుకోవాలనే ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటికే ఉన్న మునిసిపల్ బ్యాంక్ ఖాతాలను మూసి, నిధులను GHMC జనరల్ ఫండ్‌కు బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లుగా ఉన్న కార్యాలయాల పై జిహెచ్ఎంసి పేరున బోర్డుల ఏర్పాటు చేశారు.
*1.3 కోట్లకు పైగా జనాభాతో..*
జిహెచ్ఎంసిలో విలీనమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్ ప్రాంతాలతో అదనంగా 27 సర్కిల్తో జిహెచ్ఎంసి విస్తీర్ణం భారీగా పెరిగింది. 1.3 కోట్ల జనాభాకు సేవలందించే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నది. ఇక కొత్తగా వచ్చిన సర్కిళ్లలో డివిజన్ లో ఏర్పాటు అయితే మొత్తం డివిజన్లు 280–300 మధ్య ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
*6 వేలకు పైగా ఉద్యోగులు..*
విలీన ప్రక్రియ పూర్తవడంతో జిహెచ్ఎంసి అండర్లో 6 వేలకు పైగా సిబ్బంది అదనంగా చేరనున్నారు. వీరిలో 512 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా 6 వేల అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది..

