aksharagalam.com

ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం… 17 మంది మృతి

ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం… 17 మంది మృతి
మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం
స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన అధికారులు
ముందుగా మొద‌టి అంత‌స్తులో చెల‌రేగిన మంట‌లు
త‌ర్వాత పై అంత‌స్తుల‌కు వ్యాప్తించిన మంట‌లు
బాధిత‌ల‌ను గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అధికార యంత్రాంగం

భవనంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నం
మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించిన మంటలు

ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 17 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

మంటలు అదుపులోకి వచ్చాయని, భవనం లోపల మరి కొందరు బాధితులు ఉండొచ్చ‌ని…వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మొదటి అంతస్తులో మంటలు చెలగాయాని…అక్క‌డి నుంచిపై అంతస్తులకు వ్యాపించాయని ఆయన వెల్లడించారు.

ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుంచి బయటకు వెళ్లారని సమాచారం. ఈ భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా కార్యాలయం కూడా ఉండ‌టం విశేషం.

Exit mobile version