అక్షరగళం, కీసర: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకవేళ్లేలా పనిచేస్తామని కీసర అంబేద్కర్ సంఘం నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీసర మండల కమిటీ నూతనంగా ఏర్పడిన సందర్భంలో ఆర్ జి కె కాలనీ లో ఉన్న అంబేద్కర్,బాబు జగ్జీవన్ రావు ల విగ్రహాలకు పూలమాల వేసి స్మరించుకున్నారు. మండల ముఖ్య సలహాదారులు మంగళపూరి వెంకటేష్, ఉపాధ్యక్షులు పులిపాక తిరుపతి లు ఎన్నికైన సందర్బంగా ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా మల్కాజిగిరి జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతా రాజు ముదిరాజ్,దమ్మాయిగూడ మున్సిపల్ మాజి ఛైర్ పర్సన్ వసుపతి ప్రణిత శ్రీకాంత్ గౌడ్, దమ్మాయిగూడ మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గొల్లూరి రాజు,గౌడ సంఘం అధ్యక్షుడు గందమల్ల ఉపేందర్ గౌడ్, ఆర్ జి కే కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మరియు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఈగ రాజు ముదిరాజ్,ఎమ్మార్పీఎస్ పంగ నరసింహ,
దర్శనాల విష్ణు,బొల్లం పాండు,ఆర్ జి కే షాప్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ముద్దసాని నరేష్ కుమార్,కోశాధికారి మహేష్ శెట్టి, వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

