aksharagalam.com

119 వాహనాల వేలం

119 వాహనాల వేలం

ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు

సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలోని మోయినాబాద్‌ పోలీస్ స్టేషన్, బౌరంపేట ప్రాంగణంలో ఉన్న పట్టుబడిన, వదిలివేసిన, ఎవరూ క్లెయిమ్ చేయని 119 వాహనాలను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

సైబరాబాద్‌ (మెట్రోపాలిటన్‌ ఏరియా) పోలీస్‌ చట్టం–2004 సెక్షన్‌ 6(2), 7తో పాటు, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 39, 40, 41 ప్రకారం ఈ వాహనాలను వేలం వేయడానికి అధికారిక అనుమతి ఉందని ప్రకటనలో తెలిపారు.

ఈ వాహనాలపై ఎవరికైనా యాజమాన్య హక్కులు, లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఈ ప్రకటన విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల్లో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు లోగా స్పందించని వాహనదారుల వాహనాలను పబ్లిక్ లో ఆన్లైన్ ద్వారా వేలం వేస్తామని స్పష్టం చేశారు.

మొయినాబాద్, బౌరంపేట్ ప్రాంగణాల్లో ఉన్న వాహనాల వివరాలకు కోసం మోటార్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ ఆర్ఐ ఎన్‌. వీరలింగంను సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు 94906 17317ను సంప్రదించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సైబరాబాద్‌ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.cyberabadpolice.gov.in లో అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో తెలిపారు.

Exit mobile version