aksharagalam.com

బంజారాహిల్స్‌లో కోటి రూపాయల క్రిప్టో మోసం.

– రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని మోసం చేసిన ఘటన.

– ఇన్వెస్ట్మెంట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.

– ఓ మిడియేటర్ ద్వారా తాజ్ డెక్కన్ హోటల్ వద్ద కలిసిన నిందితుడు.

అక్షరగళం , హైదరాబాద్ . క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని, తనకు పరిచయం ఉన్న స్నేహితుడి ద్వారా ఇన్వెస్ట్మెంట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఓ మిడియేటర్ ద్వారా తాజ్ డెక్కన్ హోటల్ వద్ద కలిసిన నిందితుడు లాభాలు ఇప్పిస్తామని చెప్పి, పార్కింగ్ స్థలం నుంచి నగదు రూ.1 కోటి తీసుకుని పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version