జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో మార్పులు చెయ్యండి
– సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో మార్పులు చెయ్యాలని సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన గంధరగోళంగా ఉందని ఒకే బస్తిలోని కొన్ని గల్లీలు ఒక డివిజన్ కి మరికొన్ని గల్లీలు ఇతర డివిజన్లకు కేటాయించారని, ఓకే ఇంటి నెంబర్ కు వచ్చే క్రమ సంఖ్యలు కూడా ఒక్కొక్క డివిజన్ కి కేటాయించారని, చిరునామాలోని పిన్ కోడ్ ఒక్కటే ఉన్నప్పటికీ ఇతర పిన్ కోడ్ లు ఉన్న డివిజన్లకు కేటాయించారని దీనివల్ల ప్రజలకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున పునర్విభజన సందర్భంగా జరిగిన లోటుపాట్లను సరిదిద్ది ఒకే బస్తీలో ఉన్నటువంటి అన్ని గల్లీలను ఒకే డివిజన్లో కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని నేడు గాజుల రామారావు డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డికి సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ వినతి పత్రం ఇచ్చారు.
ఈ అంశం పైన జీహెచ్ఎంసీప్రధాన కమిషనర్ ని కూడా కలిసి అభిప్రాయాలను చెప్పి గతంలో జగద్గిరిగుట్ట లో ఉన్నటువంటి మక్దుమ్ నగర్ లోని అన్ని బస్తీలను కలిసి ఉండేలా చూసి డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతామని అన్నారు. అదేవిధంగా గాజులరామారం డివిజన్ కి దూరంగా ఉన్నటువంటి మిథిలా నగర్ ను తొలగించాలని ఉమా మహేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, జగద్గిరిగుట్ట శాఖ కార్యదర్శి ఎం సహదేవరెడ్డి, సీనియర్ నాయకులు సుంకిరెడ్డి, వంశీ లు పాల్గొన్నారు.
