– అని మా ఆఫీసర్లను అడగకండి..
– నీ ప్రైవసీకి గౌరవం ఇస్తాం
– ఎక్స్ లో పోస్ట్ చేసిన : సిపి వి.సి. సజ్జనార్
అక్షరగళం, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ పోలీసులు జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

“మా డాడీ ఎవరో తెలుసా… మా అంకుల్ ఎవరో తెలుసా… అన్న ఎవరో తెలుసా అంటూ పోలీసులను బెదిరించే ప్రయత్నాలు చేయొద్దు. మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం. వాహనాన్ని పక్కకు పెట్టండి. మళ్లీ వచ్చే తేదీన కోర్టులో కలుద్దాం” అంటూ సజ్జనార్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. అలాగే, మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిని ఉద్దేశించి “మియ్యా… డ్రింక్ చేశారా? అయితే స్టీరింగ్‌కు సలాం చెప్పి క్యాబ్ పట్టుకోండి. గూగుల్‌లో ‘క్యాబ్’ సర్చ్ చేయండి… ‘లాయర్’ కాదు” అంటూ వ్యంగ్యంగా హెచ్చరించారు. ఇంకొక పోస్టులో “క్యాబ్ ఖర్చు చలాన్ కంటే, జైలు శిక్ష కంటే చాలా తక్కువ. బాధ్యతాయుతంగా సెలబ్రేట్ చేయండి. లేదంటే చర్య తప్పదు” అంటూ సజ్జనార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఈ పోస్టుల ద్వారా హైదరాబాద్ పోలీస్ శాఖ మద్యం మత్తులో డ్రైవింగ్‌పై ఎలాంటి సడలింపులు ఉండవని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. పండుగలు, వేడుకల సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు.


