– కేసీఆర్‌కు సీఎం రేవంత్ కరచాలనం
–మూడు నిమిషాల్లోనే సభ నుంచి నిష్క్రమించిన మాజీ సీఎం
హైదరాబాద్, (అక్షర గళం): తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కరచాలనం చేశారు. కేసీఆర్‌ను పలకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడారు. అయితే సభ ప్రారంభమైన తర్వాత కేసీఆర్ కేవలం మూడు నిమిషాలపాటు మాత్రమే సభలో ఉండి అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

