వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది..? అనే గుసగుసలు..!
సీఎం రేవంత్ వెంట… నటుడు నాగార్జున ఉండాల్సిందేనా..?
తమ్ముడు తమ్ముడే…పేకాట పేకాటే అన్నట్టు ఉంది సీఎం రేవంత్ రెడ్డి-నటుడు నాగార్జునల వ్యవహారం. హైడ్రా అస్త్రంతో నాగార్జున ఆస్తులపై దాడి జరిగినా…దాని వెనుక రేవంత్ హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నా…సీఎం రేవంత్ రెడ్డి…నటుడు నాగార్జున కలిసే తిరగడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
ఎక్కడ కలిసినా…ఎడమొఖం పెడమొఖంలా ఉండకుండా…చక్కగా స్నేహితుల్లా కలిసిపోవడం చూస్తే… చూసేవారిని విస్తుపోయేలా చేస్తుంది.
హైడ్రా దాడుల తర్వాత నాగార్జున-సీఎం రేవంత్‌లు అఖిల్ పెళ్ళిలో కలిశారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న సినీ పెద్దల మీటింగ్‌లోనూ అత్యంత సన్నిహితంగా మెలిగారు.
మళ్ళీ మరోసారి…తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ వెంట నాగార్జున ప్రత్యక్షం కావడం అందరినీ ఆకట్టుకుంది.
సీఎం రేవంత్‌కు, నటుడు నాగార్జునకు మధ్య ఉన్న సంబంధం ఏంటి..? ఎంతుకింత సన్నిహితంగా మెలుగుతున్నారు..? అనే ప్రశ్నలు సామాన్యులను వెంటాడుతున్నాయి.
