పేద-మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత అండ
-టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం
పేద, మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొండం అండగా నిలుస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిది సత్యం శ్రీరంగం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎంఆర్ఎఫ్ సరికొత్త రికార్డులను నెలకొల్పిందని ఆయన తెలిపారు. రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో 1685. 79 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం సీఎంఆర్ ఎఫ్ ద్వారా అర్హులైన బాధితులకు అందించడం జరిగిందని సత్యం శ్రీరంగం అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఏటా 850 కోట్ల రూపాయల సాయం ప్రజలకు అందుతుందన్నారు. వైద్యం ఖర్చుల కోసం 1152. 10 కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. మొత్తం రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో 3,76,373 మందికి ఆర్థిక సహాయం అందిందని సత్యం శ్రీరంగం తెలిపారు.
